Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కై డాక్టర్లు వైద్య రంగంలో దైవ సమానులుగా విశిష్ట సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసు పత్రిలో వైద్య అధికారులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు, గౌరవ ప్రద మైన వైద్య వృత్తిలో ఉంటూ రోగులకు, సమా జానికి విశిష్ట సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వారి పాత్ర గొప్పదని అన్నారు. తమ వృత్తి రీత్యా ప్రేమానురాగాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అంకిత భావంతో సమయపాలన పాటించా లన్నారు. ప్రజలందరికీ మరో జన్మను, విలువైన ప్రాణాలను నిలబెడుతూ ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడు కాపాడేందుకు నిత్యం శ్రమించే మీరే సమాజంలో అసలైన హీరోలని, అవసరమైన ఉన్నతమైన సేవలను సకాలంలో స్పందించి ప్రాణాలు నిలబెట్టడంలో మీకు సాటి లేరన్నారు. కరోనా వంటి తీవ్రమైన మహమ్మారి నుండి రోగుల ప్రాణాలను కాపాడుటలో మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వృత్తిరీ త్యా బాధ్యతాయుతంగా పనిచేస్తూ జిల్లాలో కరోనా కట్టడిలో వైద్యుల పాత్ర గొప్పదని కలెక్టర్ అన్నారు. అనంతరం వారి విశిష్ట సేవలకు గాను వారికి శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ లు వెంకట్ రాములు, శ్రీనివాస రావు, వైద్యులు వైదేవి, సర్జన్లు పాల్గొన్నారు.