Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలి
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-తొర్రూరు
బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ము ఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాలొ ని మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓట్లు బీసీలవి, పదవులు మాత్రం అగ్రవర్ణాలకు దక్కుతున్నా యన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యా యం జరుగుతుందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదే ేశ్లో, తెలంగాణలో బీసీలకు సరైన రాజకీయ ప్రాతినిథ్యం దక్కడం లేదన్నారు. రాజకీయ ఉపాధి కోసం బీసీలను ఎన్నికల్లో వాడుకుంటున్నారని, ఏ రాజకీయ పార్టీ లు బీసీలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదని విమ ర్శించారు. ఓటు బ్యాంకు కలిగిన బీసీలకు రాజకీయ పార్టీల లో గుర్తింపు లేదని అన్నారు. బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు బసనబోయిన మురళి యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు దీకొండ కిరణ్, మండల అధ్యక్షుడు సతీష్, వెలికట్ట ఉప సర్పంచ్ దీకొండ యాకయ్య, డాక్టర్ వెంకన్న గౌడ్, నాయ కులు దీకొండ రామచంద్రు, బసనబోయిన కుమార స్వామి, బసనబోయిన మల్లయ్య, సాయి ముఖేష్, వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.