Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
టెలీమెడిసన్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లేం అప్పయ్య పిలుపునిచ్చారు. హెల్త్ వెల్నెస్ సెంటర్ ల డాక్టర్లకు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్టాఫ్ నర్సులకు టెలీ మెడిసిన్, ఈ ఔషది వినియోగంపై టాటా ట్రస్ట్ వారిచే స్థాని క ఎంపీడీవో కార్యాలయంలో రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ టేలిమెడిసిన్ ను ప్రజ లు సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు హెల్త్ వెల్నెస్ సెంటర్లు వేదికగా టెలి మెడి సిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమం లో భాగంగా సామాన్య ప్రజలకు స్పెషాలిటీ వైద్యుల సేవలను అందించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. పేరెంట్ హబ్‌గా ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు వ్యవహరిస్తాయని అసోసియేట్ హబ్ గా ఉస్మానియా గాంధీ, నిమ్స్ వంటి స్పెషలిస్ట్ ఆసుపత్రులు వ్యవహరిస్తాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లకు వచ్చినటువంటి రోగులకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలు అవసరమైనప్పుడు ఫోన్ ద్వారా రోగుల యొక్క ఇబ్బందులను వివరించి వారు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రోగులకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందించే అవకాశం ఉంటుందని, దీని ద్వారా ప్రయాణ సమయం, ప్రయాణ ఖర్చులతో పాటుగా సత్వరమే వైద్యం అందించే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ మంకిడి వెంకటే శ్వరరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు హెల్త్ ఎడ్యు కేటర్స్ సంపత్, భాస్కర్లు హెల్త్ వెల్నెస్ సెంటర్ల వైద్యులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.