Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వృద్ధాశ్రమాలు అనాథ శరణాయాలు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు వికలాంగుల సంక్షేమ కేంద్రాల్లో మెడికల్ క్యాంపులను నిర్వ హించి వైద్య సేవలు అందించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అసంక్రమిత వ్యాధులు నియం త్రణ కార్యక్రమంలో విశేష కృషి చేసినందుకు సిద్దాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం డాక్టర్ రణధీర్లను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిహెచ్ సీలు యూపీహెచ్‌సీలు వైద్య విధాన పరిషత్ బోధన ఆసు పత్రుల్లో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్యులు సిబ్బంది సేవలను ఈ సం దర్భంగా కొనియాడారు. ప్రజలకు సేవలు అందిం చడంలో తమ సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉంటా రని వర్షా కాలం సీజన్లో వచ్చే రోగాల పట్ల ప్రజలు ముందు జాగ్రత్త వహిస్తూ జబ్బులు వస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్య క్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమా డాక్టర్ వాణి, డాక్టర్ గీతాలక్ష్మి, మాస్‌మీడియా అధికారి వేముల అశోక్‌రెడ్డి, యా దగిరి, ఎస్ఓ ప్రసన్న కుమార్, డిపిహెచ్ ఎన్ ఓ సుశీల, హె చ్ఈఓ చంద్రశేఖర్, చైతన్య, శ్రీనివాస్, సునీత పాల్గొన్నారు.