Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడిచుట్టూ వరదనీరు ఇబ్బంది పడుతున్న చిన్నారులు
నవతెలంగాణ-మంగపేట
స్వపరిపాలనలో సైతం అభివృద్ధి జాడలేదని చెప్పడానికి ఈదశ్యం సరిపోతుందేమో... బడిచుట్టూ వర్షపు వరదనీరు నిలిచి బడికివెళ్లేందుకు చిన్నా రులు భయపడుతున్న దృశ్యం. మండలంలోని రాజుపేట పం చాయతీ దేవనగరం ఎంపీపీ ఎస్ పాఠశాలలోనిది. రెండు రోజులుగా కురుస్తున్న కొద్ది పాటి వర్షానికే గ్రామంలోని లోతట్టులో ఉన్న పాఠశాల చుట్టూ చేరి చెరువును తలపిస్తుంది. దీంతో సుమారు 46 మంది చిన్నారులు బడికి వెళ్లేందుకు జంకుతున్నారు. తల్లితండ్రులు సైతం పిల్లలను పాఠశాలకు పంపేందుకు ససే మిరా అంటున్నారు. మండలంలో ఇటీవల జరిగిన పల్లెబాట, బడిబాట కార్య క్రమంలో పాఠవాల దుస్థితిని అధికారులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసు కోలే దని పాఠశాల సైతం శిథిలావస్థలో ఉందని హెచ్ఎం మంకిడి బుచ్చ య్య, ఉపాధ్యాయులు తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పాఠశాలకు మర మ్మతులు చేయించి వరదనీరు పోయేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.