Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మండలంలోని కన్నెపెళ్లిలో మంగళవారం కాటారం డీఎస్పి బోనాల కిషన్ సైబర్ నేరాలు, సీసీ కెమెరాల పై గ్రామస్తులకు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అదేవిధంగా గ్రామస్తులు సీసీ కెమెరాల కోసం సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జెన్కో ఉద్యోగస్తులు సీసీ కెమెరాల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో సిఐ కిరణ్, కాలేశ్వరం ఎస్సై లక్ష్మణరావు, సర్పంచి ములకలశోభ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.