Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రూ.1000 కోట్లతో కార్పొరేషన్‌ను ఏర్పా టు చేసేలా ప్రజా మద్దతు కోసం లక్ష సంతకాల సేకరణను ఉద్యమంలా ముం దుకు తీసుకెళ్లాలని తాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది గుడి మల్ల రవికుమార్ ఉద్బోధించారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు గడిచినప్పటికీ ఆటో డ్రైవర్ల జీవితాలు మారకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 5 నుండి 12 వరకు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఇమ్మడిశెట్టి రాజు అధ్యక్షతన మొదటి రోజు మంగళవారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో సంతకాల సేకరణ కార్యక్రమన్ని నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రవి కుమార్ పాల్గొని మొదటి సంతకం చేశారు. ఈ సం దర్బంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 6లక్షల మంది ఆటో డ్రైవర్లు 14 యేండ్ల తెలంగాణ రాష్ట్ర సాధన లో భాగస్వాములు అవగా 22 మంది ఆటో డ్రైవర్లు ఆత్మబలిదానాలు చేశారన్నారు. 6000 మంది ఆటోడ్రైవర్ల పై క్రిమినల్ కేసులు అయ్యాయన్నారు. 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల సంక్షే మమే రూ.1000 కోట్ల ఆటో డ్రైవర్స్ కార్పొ రేషన్ కోసం ప్రజా మద్దతు కూడా గట్టుతోందని అన్నారు. ఆటో డ్రైవర్ల న్యాయ బద్ధమైన కార్యక్ర మానికి ప్రజలు, రాజకీయ నాయకులూ, ప్రజా ప్రతి నిధులు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాడు కేంద్ర కార్యాల య ఇంచార్జి దార సూరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సారా మహీందర్తా, తాడు జిల్ల నాయ కులూ బారిగేలా కృష్ణమూర్తి, మాస్క్ కరుణాకర్ , రత్నం కిరణ్ , ఐతే ప్రసాద్గ, డిపాక కిరణ్ పాక రాజబాబు కోయడ శివకుమార్ పాల్గొన్నారు.