Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వినోద్‌కుమార్
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం హామీలకు పరిమితం కాకుండా అర్హులైన అన్ని దళిత కుటుం బాలకు అందించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపూరి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం నియోజక వర్గ కేంద్రంలో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహ ఎదుట నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళిత అభ్యున్నతికి పాటుపడుతున్నామని చెబుతూనే, దళిత సమాజాన్ని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం టీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఇచ్చి, అసలైన దళిత కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. నియోజక వర్గంలో అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందించాలని అన్నారు. గతంలో పాలక ప్రభుత్వాలు తమ పార్టీకి, నాయకులనీ కాకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులైన వారికి ఇండ్లు అందించారని గుర్తు చేశారు. దళిత బంధుకు అర్హతకలిగిన వారికై నియోజక వర్గ పరిధిలోని అన్నీ గ్రామాలు పర్యటించి, ఫిర్యాదులు వెల్లువను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ చింత ఎల్లయ్య, నలిమేల ఏలియా, ఐలపాక శ్రీనివాస్, మారపాక వసంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు..