Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియా సింగరేణి ఓపెన్ కాస్ట్-2 భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభావిత గ్రామాల రైతులు మంగళవారం సింగరేణి జీఎం మల్లెల సుబ్బారావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 సంవత్సరంనుండి సింగరేణి సంస్థ మాకు నష్టపరిహారం ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నామన్నారు. ఇదే సమ యంలో జిఎం కార్యాలయంలో సైతం పలుమార్లు దరఖాస్తులు చేస్తూ సమస్యను తెలిపామని వారు వివరించారు. ఈనెల 20 లోపు నష్టపరిహారం ఇవ్వకుంటే 22వ తేదీ నుండి ఓసి-2, కేటికుే1 ఇంక్లైన్ను నిరవధికంగా బంద్ చేయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫకీర్ గడ్డ, ఆకుదారి వాడ రైతులు బుర్ర రమేష్ గౌడ్, శంకర్, తిరుపతి .సిధూరాల మల్లయ్య, కోల రాజు, రాజమల్లు, రాజయ, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.