Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రి ఎదుట సీపీఐ(ఎం) అందోళన
నవతెలంగాణ-గార్ల
స్థానిక సివిల్ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసిన ఆస్పత్రిలో పూర్తిగా వైద్యులు, సిబ్బంది లేరని వెంటనే నియమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆస్పత్రి ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్య సిబ్బంది లేక రోగులు ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. మహిళ వైద్యురాలు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వైద్యురాలిని నియమించాలని కోరారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి లో అన్ని రకాల రక్త పరీక్షలు, ఎక్స్రే,స్కానింగ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిలో మార్చురీ గది ఏర్పాటు చేయాలని, అన్ని సబ్ సెంటర్లలో కోవిడ్ పరీక్షలు నిర్వహిం చాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కరించాలన్నారు. లేదంటే దశలవారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు భూక్య హరి, ఎం గిరిప్రసాద్, వి వెంకటేశ్వర్లు, వి కొండయ్య, ఎం శాంతి కుమార్, ఎ రామకృష్ణ, ఐ వెంకన్న, డి శ్రీను, వి వీరభద్రం, నాగరాజు, అశోక్, బి రవీందర్, భద్రు, లక్ష్మీ, చిరంజీవి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.