Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరణ్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఆరోగ్యశ్రీ సేవల ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం హనుమకొండ వరంగల్‌కు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు మన జిల్లాలో ఉండే గ్రామా లు పల్లెల నుండే కాకుండా కాళేశ్వరం వరకు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి వచ్చి ఈ సేవలు అందుకునేలా ఏర్పాటు చేయడం అందరికీ శుభ సూచికంగా ఉంద న్నారు. అంతేకాకుండా అనారో గ్య కారణాలవల్ల వైద్యం చేయిం చుకున్న పేద ప్రజలకు (సీఎంఆర ్ఎఫ్) ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆదుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలోని కిరణ్ హా స్పి టల్ నందు ఆరోగ్యశ్రీ, ఆయు ష్మాన్ భారత్ సేవ లను మొట్ట మొదటిసారిగా సంతోషకరమని ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వి ని యోగం చేసుకోవాలని కోరారు. కార్య క్ర మంలో వైద్యులు కిరణ్, అభిరామ్, శ్రీకాంత్, భువన్‌రెడ్డి, దినేష్, రఘు, రాజమోహన్, ప్రసన్న ,ప్రవళిక ,రజిత, చందు కృష్ణ, వంశీకష్ణ, మమతా దేవిలతోపాటు కౌన్సిలర్లు శిరూప అనిల్, పిల్లలమర్రి శారద, నాగుల శిరీష దేవేందర్ రెడ్డి, నూనె రాజు, ముంజల రవీందర్ గౌడ్, మురళీధర్, ఆకు దారి మమతా రాయమల్లు, ఎడ్ల మౌనిక శ్రీనివాస్. హాస్పిటల్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు.