Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా
నవతెలంగాణ-గణపురం
కాకతీయ వైభవ సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బావిష్ మిశ్రా తెలిపారు. మంగళవారం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర్వహిం చనున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు నిర్వహించే ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ముం దుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కలెక్టర్ ను స్వాగతం పలికారు. స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పరిరక్షణ కమిటీ వారు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించి, ఆలయ చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12న కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాల యంలో కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు నిర్వ హించడం జరుగుతుందని, ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. కాకతీయుల సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోటగుళ్ల చరిత్ర తెలిసేలా చిత్రపటాలను ఏర్పాటు చేయాలని అధికా రులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశా లలో కాకతీయుల చరిత్రపై వ్యాసరచన ,వక్రత్వ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు తెలియ జేశారు. 12న గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, డిపిఓ ఆశాలత, జడ్పీ సీఈవో శోభారాణి, పురావస్తు శాఖ ఏడి మల్లు నాయక్, ఎంపీడీవో అరుంధతి, తాసిల్దార్ సతీష్ కుమార్ ,సర్పంచ్ ఎన్ దేవేంద్ర గౌడ్, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : కాకతీయ సప్తాహన్ని వైభవోపేతంగా నిర్వహించాలని కలెక్టర్ బి గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. మంగళవారం కాకతీయ వైభవ సప్తాహం సందర్బంగా వేడుకలు నిర్వహించే ఖుష్ మహల్, వరంగల్ కోటలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేడుకలకు కాకతీయుల వారసుడు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అద్బుతంగా చేయాల న్నారు. కాకతీయల కళా వైభవం ఉట్టిపడేలా వేడు కలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్య క్రమంలో జిల్లా అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.