Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు తగ్గించాలి
- ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ తేజావత్ శ్రీకాంత్
నవ తెలంగాణ-ఖానాపురం
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అగడాలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా పిలుపునిచ్చిన బందులో భాగంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాలు వారిగా అన్ని పాఠశాల బందు విజయవంతమైందని ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ ఖానాపురంకు చెందిన తేజవత్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బందును పాటించి రాష్ట్ర ప్రభుత్వా నికి విద్యాశాఖ పై ఉన్న చిత్తశుద్ధిని గుర్తు చేశారు. బందు విజయవంతం చేసిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు పుర ప్రముఖులకు ఏబీవీపీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ అఖిల్ కార్యకర్తలు మణికంఠ సాయికిరణ్ ఆకాష్ రాజేష్ సుశిత్ సుశీల్, ఏకలవ్య తదితరులు పాల్గొన్నారు.