Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ- హన్మకొండ చౌరస్తా
ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణి పథకం వల్ల మధ్యదళారుల దోపిడీకి మత్స్యకారులు గురవుతు న్నారన్నారని, ప్రతి మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంటులో నేరుగా సగదు జమ చేయాలని టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేసారు. మంగళవారం జిల్లాలో చెరువులు, కుంటలను భూకబ్జా దారుల నుండి రక్షించాలని కోరుతూ నయింనగర్ లోని మెడికల్ రిప్రసెంటేటివ్ భవన్లో జిల్లా అధ్యక్షులు మాటూరి ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించిన టీఎంకేఎంకేఎస్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాసిరకం చేప పిల్లలు ఇవ్వడం, ఇచ్చే చేప పిల్లలు కూడా సీజన్ సమయంలో కాకుండా సెప్టెంబర్, అక్టోబర్లో ఇస్తుండడంతో మత్స్య కారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. గతేడాదిలో వేసిన చేప పిల్లలు ఇప్పటికి 100 నుండి 200 గ్రాముల కంటే ఎక్కువ పరిమా ణంలో పెరగడం లేదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా మత్స్యకారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మత్స్యకారులను ఆదుకోవ డానికి ప్రతి మత్స్య సొసైటీ అకౌంటులో రూ.10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ మాట్లాడుతూ... జిల్లాలో చెరువులు, కుంటలు పట్టణీకరణ పరిశ్రమలు రియల్ ఎస్టేట్స్ మాఫియా పేరుతో కబ్జాలకు గురౌతున్నాయన్నారు. డిజిటల్ సర్వే చేసి ఎఫ్టీఎల్ హద్దురాల్లు ఏర్పాటు చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ మహానగరంలో 10 ఎకరాల స్థలంలో రూ. 20 కోట్లతో హెరీల్సేల్ చేపల మార్కెట్, ఫిష్ స్టోరేజీ స్టోర్స్ నిర్మించాలని డిమాండ్ చేసారు. నగరంలో శాశ్వత రిటైల్ ఫిష్ మార్కెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. సొసైటీలకు ప్రభుత్వ సహకారం అందడం లేదన్నారు. 50 ఏండ్లు నిండిన మత్స్యకారుడికి పింఛను రూ. రూ.5,000 ఇవ్వాలని డిమాండ్ చేసారు. జిల్లాలో అన్ని మండలాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎంకేఎంకేఎస్ జిల్లా అధ్యక్షులు ఎం ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బస రామ్మోహన్, నిమ్మల విజేందర్, జివ్వాజి లత, జిల్లా సహాయ కార్యదర్శులు మాటూరి ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల విజేందర్, జిల్లా సహాయ కార్యదర్శులు మౌటం పవన్ కల్యాణ్, నీలం బాను చందర్, జిల్లా కమిటీ సభ్యులు మల్లయ్య, సాంబరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.