Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎన్ఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబరాజు యాదగిరి
నవతెలంగాణ-ఖిలావరంగల్
ప్రజా సంస్కృతి రక్షణే ప్రజా నాట్యమండలి బాధ్యతని పీఎన్ఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబరాజు యాదగిరి అన్నారు. మంగళవారం పీఎన్ఎం వరంగల్ జిల్లా 9వ మహాసభను ఏసీరెడ్డినగర్లోని రఘునాథ్ భవన్లో డీ రవి అధ్యక్షతన నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సామ్రాజ్యవాద సంస్కృతి పెరిగిపోతోందని వాపోయారు. ప్రజా సంస్కృతి మరుగున పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతో న్మాదం, కులోన్మాదం, మూఢ నమ్మకాలు వీపరితంగా పెరిగిపోతు న్నాయ న్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా, వారిని చైతన్య వంతం చేసే దిశగా పీఎన్ఎం ఎనలేని కృషి చేస్తోందన్నారు. పీఎన్ఎం ప్రజ ల్లో శాస్త్రీయ అవగాహనను పెంపొదిస్తోందన్నారు. ఏండ్ల తరబడి ప్రపంచ శాంతి, స్వాతంత్య పోరాటంలో, వివిధ సామాజిక, సాంఘీక ఉద్యమాలను పీఎన్ఎం ముందుండి నడిపించిందన్నారు. వ్యకాస నాయకులు సీహెచ్ రం గయ్య మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమ స్య, నిరుద్యోగం, ఉపాధి లేమి, రైతుల సమస్యలు, కూలీల సమస్యలు తీసు కుని తమ కళా రూపాల ద్వారా పీఎన్ఎం ప్రజలను చైతనం చేయాలని సూచించారు. మాజీ పీఎన్ఎం నాయకులు ఎం సాగర్ మాట్లాడుతూ.. జిల్లా లో పీఎన్ఎం ఎదిగి ప్రజా సంస్కృతి వెల్లి విరియాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా దాసారపు అనిల్, కార్యదర్శిగా వలదాసు దుర్గయ్య, సభ్యులుగా డీ రవి, ఎం జీవన్, జన్ను సునంద, కే అఖిల్, ఎస్ జానీ, ఆర్ ప్రవీణ్, జే సురేష్, కే రమేశ్, లావణ్య, వెంకట్లు ఎన్నికయ్యారు.