Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం మహాసభలు వరంగల్ మండలం రంగంపేట ఏరియా పార్టీ కార్యాలయం అవరణలో మంగళవారం నిర్వహిం చారు. ఈ మహాసభలకు అధ్యక్షవర్గంగా కొంగర వరుణ్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరురి కుమార్ పాల్గొని మహాసభను ప్రారంభించారు. అనంతరం రంగంపేట ఏరియా కమిటీ 14 మందితో 8 మంది ఆఫీస్ బేరర్‌గా 6 మంది కమిటీ సభ్యులుగా ఎన్నిక చేశా రు. ఏరియా కార్యదర్శిగా సింగారపు సుమన్, అధ్యక్షులుగా వరుణ్‌ను అరూరి కుమార్ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతర కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతు దేశంలో దళితులపై రోజురోజుకు పెరు గుతున్న దాడు లు. మనువాద పాలకుల వైఖరితోనే దాడులు మరింత పెరుగుతున్నాయని అన్నారు. ఈ విధానాలను దళితులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దళిత బంధు తమ అనుయాయులకు, ఎమ్మెల్యేలకు సెలక్షన్ చేసే అధికారాలు ఎత్తివేసి అధికారుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని లేనిపక్షంలో దళితులు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిఐటి యు జిల్లా నాయకులు సింగారపు బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనా విధానాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రంగశాయి పేట ఏరియా కార్యదర్శి ఉసిల్ల కుమార్, కొంగర వరుణ్, సింగారపు సుమన్ రాజు, వేల్పుల రాజయ్య, దరి పెల్లి కుమార్, పుల్ల మాధవి ,అంతే అంజలి, కళావతి ,జన్ను యాకయ్య, అమర్, దేవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.