Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
బంజారాల సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకోవాలని తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలోత్ బిక్షపతి నాయక్ అన్నారు. సీత్లా పండుగను మంగళవారం మండలంలోని పెద్ద మంగ్యా తండా, కొమ్మనపల్లి తండా, సోమారపు కుంట తండా,టిక్యా తండా లతో పాటు ఆయా తండాల్లో ఘనంగా నిర్వహించారు. కొమ్మనపల్లి తండా లో జరిగిన సీత్లా భవాని పండుగ సంబరాల్లో బిక్షపతి నాయక్ గిరిజనులతో కలిసి పాల్గొని మాట్లాడారు. వేల సంవత్సరాల క్రితం నాటి నుండే వ్యవసాయం, పశుపోషణలో బంజారాల పాత్ర కీలకమన్నారు. ముస్లిం, దండయాత్ర, బ్రిటిష్ కాలంలో అనేక దాడులు జరిగినా బంజారాలు వారి సంస్కతి సంప్రదాయాలను వదులుకోలేదన్నారు. లంబాడీలు పశు పోషణ జీవనాధారంగా కొనసాగిస్తున్నారని అన్నారు. సర్పంచ్లు పాడ్యా రమేష్ నాయక్, జాటు శారదా రమేష్ జాటోత్ కౌన్సిల్య, భానోత్ యాకమ్మ కిషన్, చింతలపల్లి ఎంపీటీసీ భూక్య గణేష్ నాయక్, స్థానికులు బానోతు రాజ్ కుమార్, భూక్య బాసు, జాటోత్ వెంకన్న, జాటోత్ టికు నాయక్, బీకు నాయక్, జాటోత్ స్వామి, సాయి కష్ణ తదితరులు పాల్గొన్నారు.