Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
సంక్షేమ, అభివృద్ధి అమలులో సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గ పరిధి రఘునాథపల్లి మండల అధ్యక్షుడు వారాల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీకండువా కప్పి ఆహ్వానించి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివద్ధి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతీ ఒక్కరికీ వారిస్థాయికి తగ్గకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. రాష్ట్రంలో 29రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పాలనను కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. రూ. 58వేల కోట్లు రైతు బంధుతో రైతుల ఖాతాల్లో జమ చేశారని, పెట్టుబడి సాయం ఎకరాకు రూ.10వేలు, సుమారు 36వేలకోట్లతో 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, 4వేలకోట్ల మంది రైతులకు రూ. 22వేలకోట్ల రుణమాఫీ, సాగునీటి కోసం రూ.85వేలకోట్లతో కాళేశ్వరం, రూ.125కోట్లతో ఎస్సారెస్పీ పునర్విభజన పనులు, రూ.12వేల కోట్లతో దేవాదుల ప్రాజెక్టు కోసం వెచ్చించి, గోదావరి జలాలను సైతం రాష్ట్ర ప్రజల ముంగిటనుంచాడని అన్నారు. 42లక్షల మందికి ఆసరా ఫించన్లు, మహిళా అభ్యున్నతికి కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కాన్పులో బిడ్డ పుడితే రూ.13వేలు, కొడుకు పుడితే రూ.12వేలు అందిస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. గ్రామాలు సుందరంగా మార్చి, దేశంలోనే మొదటి 10స్థానాల్లో రెండు మార్లు గుర్తింపు పొందామన్నారు. దళితుల ఆర్థిక బలోపేతానికి దళిత బంధు ప్రకటించి అమలు చేస్తున్నారని అన్నారు. స్థలముండి ఇల్లు లేనివారికి రూ.3లక్షల సాయంతో సొంతింటి కళ నెరవేరనుందని అన్నారు. పండగలకు పూర్వ వైభవం కేవలం టీఆర్ఎస్ పాలనలో లభించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ మొండి వైఖరతో, ఇంతటి గొప్ప పాలనకు అడ్డుతగులుతూ అభాసుపాలు చేస్తోందని అన్నారు. ''తస్మాత్ జాగ్రత్త మోడీ'' ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. అనంతరం మండల ప్రాదేశిక సభ్యుల పదవీ కాలం మూడేండ్లు ముగిసిన సందర్భంగా జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, ఎంపీటీసీలు సింగపురం దయాకర్, బెల్లపు వెంకటస్వామి, గన్ను నర్సింహులు, కనకం స్వరూప గణేష్, గుర్రం రాజుతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇన్‌ఛార్జి ఆకుల కుమార్, తోట సత్యం, నియోజక వర్గ ప్రచార కార్యదర్శి తాటికొండ వెంకటేష్ యాదవ్, దిశా కమిటీ సభ్యులు రమేష్ నాయక్, ఎన్ శ్రీరాములు, మండల అధ్యక్షుడు గణేష్, స్వాతి శ్రీనివాస్, కవితారెడ్డి, రజిత, మల్లేష్, అశోక్, నర్సింహ, మహేష్, జోగు కుమార్, తదితరులు పాల్గొన్నారు.