Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నవతెలంగాణ-వర్ధన్నపేట
మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా 6 గ్రామైక్య సం ఘాలకు అనువైన భవనసముదాయం నిర్మించేం దుకు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో క్యాంప్ ఆఫీసులో ఇల్లందలోని గంగ, యమునా, సర స్వతీ, తుంగభద్ర, కావేరి, నర్మద, గ్రామైక్య సంఘాల ప్రతినిధుల బృందం క్లస్టర్ కోఆర్డినేటర్ గోలి కొము రయ్య ఆధ్వర్యంలో క్లస్టర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే రమేష్ రూ.30 లక్షల మంజూరు చేయించి అన్ని హంగులతో కూడిన అధునాతనమైన నూతన భవనాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమ అభివద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసి అన్ని గ్రామాల్లో గ్రామైక్య సంఘ భవన నిర్మా ణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పిటిసి మార్గం బిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా ఆత్మ చైర్మన్ గోపాల్రావు, మండల పార్టీ అ ధ్యక్షుడు కుమారస్వామి, సర్పంచ్ సుంకరి సాం బయ్య, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్, ఏపీఎం వేణు కొమురయ్య, వివో ప్రతినిధులు ఎడ్ల అరుణ మోడెం కవిత, ఎస్ పి సుజాత, మౌనిక, మహేశ్వరి, నిర్మల, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ
పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని దివిటిపల్లికి చెందిన కునూరు యాదగిరి ఎలుగు బంటి దాడిలో మతి చెందగా వారి కుటుంబ సభ్యు లైన నాగలక్ష్మికి పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ రూ. 2 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును, కొత్తపల్లికి చెందిన జన్ను సంతోష్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులైన కవిత కి రూ .2 లక్షలు పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి బాధిత కుటంబాలకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పిటీసి మార్గం బిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, వర్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ స్వామి రాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ళ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.