Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీఓ అంకిత్
నవతెలంగాణ-ఏటూరునాగారం (టౌన్)
గిరిజన మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఉన్న వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఐట ీడీఏ పీఓ అంకిత్ అన్నారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ, వీ హబ్ సంస్థ ఆధ్వర్యంలో ఔత్సహిక గిరిజన పారిశ్రామిక వేత్తలకు, మహిళలకు మంగళ, బుధవారాల్లో మండల కేం ద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముగింపు సమా వేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి 138 మంది ఔత్సహిక గిరిజన మహిళలు పాల్గొ న్నారని, వీరికి వ్యాపారాన్ని ఎలా అభివద్ధి చేసు కోవాలో వీ హబ్ వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారన్నారు. వ్యాపా రాలను చేసుకోవడంలో మహిళలు ముందు స్థాయిలో నిలబ డాలన్నారు. ఒకరిపై ఆదార పడకుండా స్వయం ఉపాధిగా ఎదగాలని పిలుపునిచ్చారు. జేడీఎం కొండల్రావు, వీహబ్ ప్రతినిధులు తరుణ్, విజేందర్, జరుషా, జేఆర్పీలు మేకల పాపారావు, సరస్వతి, మహిళలు పాల్గొన్నారు.
సబ్సిడీ రుణాలు ఇప్పించాలని వినతి
రెండు రోజుల పాటు శిక్షణకు వచ్చిన గిరిజన మహి ళలు అపర్ణ, నర్సమ్మ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత ఐటీడీఏ పీఓ అంకిత్‌ను సబ్సిడీ రుణాలు ఇప్పించాలని విన్నవించారు. తాము శిక్షణ తీసుకున్న మహిళలకు బ్యాం కుల ద్వారా సబ్సిడీ రుణాలను ఇచ్చి ఆదుకోవాలన్నారు. రుణ సదుపాయం లేకపోవడంతో ఇలాంటి శిక్షణ తీసుకున్న ఎలాంటి ఫలితం లేదని పీఓకు వివరించారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గోవిందరావుపేట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీ డీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ అన్నారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సుకుమార్, సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి మంచి మెరుగైన సేవలను అందిం చాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రం రికార్డులను ఆయన పరిశీలించారు. ఆస్పత్రిలోని ల్యాబ్, మందుల పం పిణీ ఫార్మసిస్ట్ మౌలిక సదుపాయాలను ఆయన పరిశీ లించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణపై ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత కల్పిస్తూ జాగ్రత్తతో వ్యవహరించాలని అన్నారు.