Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
నవతెలంగాణ-ఖానాపురం
పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అన్నా రు. భారత విద్యార్థి ఫెడరేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అశోక్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డి 8 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభు త్వ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేద న్నారు. అంతేకాకుండా విద్యావ్యవస్థను మొ త్తం భ్రష్టు పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూనే తెలం గాణ ప్రభుత్వం గడిచిన ఏప్రి ల్, మే పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులకు డబ్బులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మ ధ్యాహ్న భోజన బిల్లులు పెం చకుండా, అంతేగాక ఇవ్వా ల్సిన బిల్లులను కూడా సరైన సమ యంలో ఇవ్వకుండా మధ్యాహ్న భోజనానికి కార్మికులు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, సకాలంలో బిల్లులు రాక పోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కార్తీక్, శ్రీనివాస్. రాజు, తరుణ్ పాల్గొన్నారు.