Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఐసిడిఎస్, సివిల్ సప్లై అధికారు లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి అంగ న్వాడీ టీచర్ ములుగు వెలుగు ఆప్ లో అటెం డెన్స్ నమోదు చేసుకుని ఉదయం 9:30 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తప్పకుండా సెంటర్ లోనే ఉండాలని, ప్రతిరోజు తప్పకుండా పౌష్టిక ఆహారాన్ని అందించి పిల్లల్లో పోషకాహార లోహం లేకుండా చూడాలని, సూపర ్వైజర్లు విధిగా సెంటర్లను తనిఖీ చేపట్టి రిపో ర్టును సిడిపిఓ లకు అందజేయాలనన్నారు. జిల్లాలో వాడుకలో లేని, పూర్తికాని బిల్డింగులు ఉన్నట్ల యితే వాటి యొక్క సమాచారం తెలియపరిచి వాటిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్, వైవి గణేష్, డిఆర్ఓ రమాదేవి, డిడబ్ల్యూఓ ప్రేమలత, జిల్లా సివిల్ సప్లై అధికారి అరవింద్, జిసిసి అధికారి ప్రతాప్, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.