Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్నోవేషన్ సెల్ ప్రధాన అధికారి డాక్టర్ శాంత
నవ తెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ నగరంలో వ్యవసాయదారిత పరిశ్ర మల స్థాపనకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రధా న అధికారి డాక్టర్ శాంత తౌటం అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని రవీం దర్ రెడ్డి, మాడురి వేద ప్రకాష్ ఆధ్వర్యంలో బుధ వారం డాక్టర్ శాంతతో పాటు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అలన్ గెమ్మెల్ ఒబే, డాక్టర్ అండ్రు ప్లేమింగ్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అధికారి వరుణ్ మాలిలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ట్రేడ్ అం డ్ ఇన్వెస్ట్మెంట్ మిషన్‌లో భాగంగా వరంగల్ నగ రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గొర్రెకుం టలోని కరాణి స్పైసెస్ పరిశ్రమను సందర్శించి యజమాని రాజేష్, డికరాణితో మా ట్లాడి వివ రాలు తెలుసుకున్నారు. వ్యవసాయాధారిత, ఇతర పరిశ్ర మల స్థాపనకై వరంగల్ అన్ని విధాల అనుకూలమైన అవకాశములు ఉన్నట్లు గుర్తించి సంతృప్తి చెందారు. అనంతరం కాకతీయ మెగా టెక్స్టై ల్ పార్కులోని గణేషా ఎకోపెట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను కూడా సందర్శించి పరిశ్రమల స్థాపనకై ముడి సరుకు లభ్యత, ఎలక్ట్రిసిటీ, రైలు, రోడ్డు మా ర్గాల ద్వారా రవాణా వివరాలు అడిగి తెలుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. చారిత్రాత్మకంగా రైలు, రోడ్డు మార్గాలలో ట్రాన్స్‌ఫోర్ట్ కనెక్టివిటీ కలిగి, అందు బాటులోని టెక్నికల్ స్కిల్స్ కలిగిన ట్రేయిన్డ్ మ్యాన్ పవర్ మొదలగు అంశాలను అధ్యయనం చేసి సంతప్తి వ్యక్తం చేసినట్లు ఛాంబర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు.