Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లింపు
- తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, వద్దిరాజు అభిమానులు
నవతెలంగాణ-తాడ్వాయి
వన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మొక్కులు చెల్లించు కున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య బుధవారం ఆయన మేడారం తల్లుల సేవలో గడి పారు. అమ్మవార్లకు చీరె, సారె, బెల్లం ముద్దలు నైవే ధ్యం సమర్పించి, పూజలు చేశారు. తొలుత ఆల యానికి విచ్చేసిన ఎంపీతో పాటు కుటుంబ సభ్యుల ను పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలి కారు. దగ్గరుండి సమ్మక్క, సారలమ్మల గద్దెలు, పగి డిద్దె రాజు, గోవింద రాజులను దర్శింపజేసి, తీర్ద ప్రసాదాలు అంద జేశారు. మొక్కుల చెల్లింపు వేడుకకు, వరం గల్, ఖమ్మం మహబూ బాబాద్ జిల్లాల నుంచి వద్దిరాజు అభిమానులు పలువురు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, జలవనరుల అభివద్ధి మండలి చైర్మన్ వి.ప్రకాష్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, నాయకులు పుట్టం పురు షోత్తం, టీఆర్ఎస్ నాయకులు బొలుగొడ్డు శ్రీనివాస్, సిలువేరు శ్రీని వాస్, తోట వేణుమాధవ్, వద్దిరాజు యూత్ సభ్యులు దూరుశెట్టి సుదీర్, యాకుబ్ పాషా, పాల్గొన్నారు.