Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాట ికొండ రాజయ్య అన్నారు. జగ్జీవన్ రామ్ 36వ వర్ధంతి సందర్భంగా నియోజక వర్గ కేంద్రంలో మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ దళితుల అభ్యున్న తికి జగ్జీవన్ రామ్ కృషి చేశారని, దళితుల హక్కులను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరిస్తే, చట్టరూపంలో అమలు చేయడానికి జగ్జీవన్ రాం చేసిన కృషి మరువలేనిదన్నారు. సుమారు 45ఏండ్లు పార్లమెంటు సభ్యునిగా చరిత్రలో నిలిచిన మహనీయుడని కొనియాడారు. దళితులు ఐక్యతతో విద్యను వజ్రాయుధంగా మలుచుకుని ఆర్థిక స్వావలంభనతోపాటు ఆత్మగౌరవంతో జీవించేందుకు కృషి చేయాలని అన్నారు. అప్పుడు ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అన్నారు. జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎడవెళ్ళి క్రిష్ణారెడ్డి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, ఏఎంసీ చైర్మెన్ గుజ్జరి రాజు, సర్పంచులు సురేష్, ఎంపీటీసీలు దయాకర్, గన్ను నర్సింహులు, గుర్రం రాజు, రమేష్ నాయక్, డైరెక్టర్లు సత్యం, శ్యాంరెడ్డి, సరిత, రాఘవరెడ్డి, ప్రసాద్‌బాబు, రాజు పాల్గొన్నారు.
బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్
మహాబూబాబాద్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహానీయుడు జగజీవన్‌రామ్ అని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ లోని జగజీవన్‌రామ్ విగ్రహా నికి ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీం దర్రావు పూలమాళలేసి ఘన నివాళులర్పించారు. మున్సిప ల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మెన్ ఎండీ ఫరీద్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గద్దె రవి, గోగుల రాజు, చిట్యాల జనార్ధన్, మురళీధర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ ఖాసీం, వెంకటకృష్ణరెడ్డి పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జగ్జీవన్‌రామ్ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ భూక్య మురళి నాయక్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. నాయకులు గణపురం అంజయ్య, టౌన్ అధ్యక్షులు పోతురాజు, వార్డ్ కౌంస్లేర్ కోడి శ్రీను, మాజీ వార్డ్ కౌంస్లేర్ నారాయణ, అసంఘటిత కార్మిక శాఖ నాయకులు సల్వాది దిలీప్, బ్లాక్ నాయకులు, పాల్గొన్నారు.
జగజీవన్‌రామ్ ఆశయాలు కొనసాగించాలి
జనగామ : బాబు జగజీవన్‌రామ్ మహా నుభావుని ఆశయాలను కొనసాగిద్దామని ప్రభు త్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సురేష్ సుగుణకర్ రాజు, కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు జెరిపో తుల పర్శరాములు అన్నారు. బుధవారం స్థానిక ఆర్ అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద జనగామ జిల్లా అం బేద్కర్ యువజన సంఘం, కరెన్సీఫై అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గిరిమల్లె రాజు అధ్యక్షతన జగజీవన్ రామ్ విగ్రహా నికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కౌన్సిలర్లు బోట్ల శ్రీనివాస్, వంకుడోతు అనిత, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు వంగ ప్రణీత్, దళిత నాయకులు తిప్పరపు విజరు, ఉపేందర్, ప్రభాకర్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు సాగర్, పర్శరాములు, నాయకులు పాల్గొన్నారు.
పెద్దవంగర : కుల రహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన ఆదర్శ నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని నిర్వహించారు. రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు నెహ్రునాయక్, సుధీర్, మాజీ మండల అధ్యక్షుడు యాదగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజరు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పాల్గొన్నారు.
పాలకుర్తి : మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుపల్లి యాదగిరి స్వామి పాల్గొని మాట్లాడారు. ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి ఇనుముల నరసయ్య, మండల ఇన్చార్జి దండు రామచంద్రు పాల్గొన్నారు.
బచ్చన్నపేట : జగజ్జీవన్‌రామ్ వర్ధంతిని ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని విశ్రాంత భవనంలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఎంఎస్పీ జిల్లా నాయ కులు నర్సింగరావు మాలమహనాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలనర్సయ్య, ఎంఎస్పీ నాయకులు అనిల్, రాజు, అంజయ్య, వీహెచ్ఎస్ నాయకులు కామిడి సిద్దారెడ్డి, రాజు, స్వామి, వినోద్, కనకయ్య, పాల్గొన్నారు.