Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో అగ్రికల్చర్ స్డడీ టూర్
నవతెలంగాణ-నర్సంపేట
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, శాస్త్రవ్తేతల బృందం అమెరికాలోని బేయర్ క్రాస్ సైన్స్ డివిజన్‌ను సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పత్తి సాగుపై అధిక సాంద్రత, పూర్తి సాగు విధానంపై అమెరికాలోని టెక్సాస్, వర్జీనియా, లుసియాన రాష్ట్రాలలో వ్యవసాయ విజ్ఞాన యాత్రను (అగ్రికల్చర్ స్టడీ టూర్) నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలోని 700 చెస్టర్ ఫీల్డ్ పార్క్ వే వెస్ట్, చెస్టర్ ఫీల్డ్, మిస్సౌరీ లో ఉన్న 'బేయర్ క్రాప్ సైన్స్ డివిజన్' చెస్టర్ విలేజ్ ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర, వ్యవసాయ శాత్రవేత్తలు, అధికా రులు సందర్శించారు. సైన్స్ డివిజన్ శాస్త్రవేత్తలు పత్తి విత్తనాలు, సాగు విధానం అధిక దిగుబడులపై వివరించారు.అమెరికాలోని సేంట్ లూయిస్ నగరంలో విత్తన గ్లోబల్ సంస్థ అధినేత జెస్సీ, రిచర్డ్ లీమ్ గ్రుబెర్తో కలిసి పత్తి విత్తనాలపై పరిశోధనను పరిశీలించారు.