Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ-జనగామ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించి పెద్దఎత్తున బైఠా యించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మబిక్షం పాల్గొని మాట్లాడారు. పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా నేటికీ అన్ని పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్స్ నేటికీ విద్యార్థులకు అందలేద న్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదు పాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో కేటాయించి నిధులతో పాఠశాలను అభివద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేయా లన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఒకే పేరుతో అనేక బ్రాంచీలు పెడుతూ విద్యను వ్యాపారం చేస్తున్నాయ న్నారు. ఇరుకైన గదుల్లో ప్రయివేటు పాఠశాలలు నడపడమే కాకుండా కనీస సౌక ర్యాలు కూడా కల్పించట్లేదన్నారు. ప్రభుత్వ నిబం ధనలు పాటించడం లేదని అన్నారు. జీఓ 91 ప్రకారం ఎలాంటి అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దనే నిబంధన ఉన్నా పట్టించుకో వట్లేదన్నారు. ప్రభు త్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తరుణ్నాయక్, యాకన్న, అంజలి, తదితరులు పాల్గొన్నారు.