Authorization
Fri March 07, 2025 01:42:47 pm
- ఎమ్మెల్యేడాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-రఘునాథపల్లి
మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో రూ.18లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ శంకరి అనిత అధ్య క్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శిస్తే పతిపక్షాలకు పుట్టగ తులుండవని హెచ్చరించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే ప్రజలు, కార్యకర్తలను కంటికి రెప్పగా కాపాడుకుంటున్నానన్నారు. రాష్ట్రంలోనే అభివృద్ధిలో స్టేషన్గన్పూర్ నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రతి సర్వేలో నియోజకవర్గ అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు వచ్చిందన్నారు. త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితబంధు అత్యధికంగా ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండో విడత దళితబంధులో నియోజకవర్గానికి 1500 యూనిట్లు వస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.