Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంపత్‌రావు
నవతెలంగాణ-జనగామ
నాయకత్వంలో ఉన్న వారికి చేసే సన్మానాలు వారి బాధ్యతలను గుర్తు చేస్తాయని ఇండియన్ మెడికల్ అసోసయేషన్(ఐఎంఏ) రాష్ట్రశాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎం సంపత్‌రావు అన్నారు. మంగళవారం రాత్రి జనగామ జిల్లాలోని ఐఎంఏ భవన్లో 320ఎఫ్ జిల్లా ఆద్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ హానరింగ్ జిల్లా చైర్మెన్ డాక్టర్ జె బాలాజీ సౌజన్యంతో సన్మానోత్సవం నిర్వహించారు. అనంతరం జిల్లా గవర్నర్ కన్న పరశురాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సంపత్‌రావు మాట్లాడుతూ కోవిడ్ కాలంలో వైద్యుల సేవలను గుర్తుచేశారు. విరామ మెరుగని రీతిలో వైద్యులు పని చేస్తారనడానికి డాక్టర్ బీసీ రారు జీవితం నిదర్శనం అన్నారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ వైద్యులను సన్మానించడం అభినందనీ యమన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ రావు, తక్షణ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి, లయన్స్ నాయకులు, జిల్లా ఉప గవర్నర్లు ఎన్ వేంకటేశ్వరరావు, కుందూరు వెంకట్ రెడ్డి, పూర్వ జిల్లా గవర్నర్లు ముచ్చ రాజిరెడ్డి, పోకల చందర్, టి లక్ష్మి నరసింహ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జాతీయ నాయకుడు డాక్టర్ పి విజయచందర్ రెడ్డి, మహబూబాబాద్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె వెంకటేశ్వర్లు, తదితరులు సన్మాన గ్రహీతలను అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ని వైద్యాధికారులు ఏ మహేందర్, పి. సుగునాకర్ రాజు, నల్ల సురేందర్ రెడ్డి, శేషు మాధవ్, గిరిధర్ రెడ్డి, సాంబశివరావు, వెంకటరమణ, కాలిప్రసాద్, సిహెచ్. రాజమౌళి, బి. బాలాజీ, నాగార్జునరెడ్డి, జగదీష్, తాళ్ళ రవి, ఏ. శ్రీనివాస్, బి. లక్ష్మీనారాయణ, ఎం సుదీప్, పూజారి రఘు, స్వప్న రాథోడ్, సుదార్ సింగ్, రాజిరెడ్డి, సరోజ తదితరులను శాలువ, ధ్రువపత్రం, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్ నాయకులు నాగబండి రవీందర్, అల్లాడి ప్రభాకర్, చంద్రగిరి ప్రసాద్, కష్ణాజీవన్ బజాజ్, డా. అజీత్ కుమార్, ఆకుల మహేష్ కుమార్, దోర్నాల వేంకటేశ్వర్లు, ప్రమోద్‌కుమార్, వెంకన్న, రాంగోపాల్ రెడ్డి, వెంకటస్వామి, ఉషా మార్తా తదితరులు పాల్గొన్నారు.