Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
మానుకోటలో ఆటో డ్రైవర్లపై ఆర్టీవో అధికారుల వేధిం పులు ఆపాలని, తనిఖీల పేరుతో కార్మికులపై జరిమా నాలు వేయడానికి వెంటనే మానుకోవాలని కోరుతూ బుధవారం ఆటో డ్రైవర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక నర్సంపేట బైపాస్ రోడ్డు నుండి ఆటోల ద్వారా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంవీఐ రమేష్ రాథోడ్‌కు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ,చదువుకున్న నిరుద్యోగులకు ఆసరా గా ఉన్న ఆటోలతో నేడు సరైన ఆదాయం దొరకడం లేదని తెలిపారు. ఆర్టీవో అధికారులు చెకింగ్‌ల పేరిట వేలాది రూపాయల ఫైన్లు వేస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లు 15 రోజులు సంపాదించినదంతా చలానాలకే సరిపోతోం దన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్ రేట్లు మరింత భారంగా మారాయన్నారు. ఈ క్రమంలో ఆర్టీవో అధికారులకు ఆర్టీసీ కార్మికులు సహకరించడం తగదని, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కృషి చేయాలే గానీ ఆటో డ్రైవర్ల పొట్ట కోట్టొద్దని కోరారు. వారి కోసం సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, లైసెన్స్ విధానాన్ని సరళీకరించాలని కోరారు. 2019 రవాణా చట్టం మార్చి డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ కుమరకుంట్ల నాగన్న, నాయకులు తోట శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్, ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా నాయకులు శ్యామ్, దర్గయ్య, లింగయ్య, పాషా తదితరులు పాల్గొన్నారు.