Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన కారణంగా గ్యాస్ ధరలు పెంచుతున్నామని కుంటి సాకుతో చమూరు సంస్థలు ఏకంగా 50 రూపా యలు పెంచడం అన్యాయమని గత మార్చి నుండి ఇప్పటివరకు నాలు గు సార్లు 200 రూపాయలు పైగా పెంచి పేదవాడి మీద పెనుబరం మో పడం అన్యాయమని ఎన్ఎఫ్ఐ డబ్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఆరోపిం చారు. గ్యాస్ ధరలకు పెంపుకు నిరసనగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ వరం గల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఒకవైపు నిత్యాసర వస్తువుల ధరలో కూరగాయల ధరలు, మందుల ధరలు. రవాణా చార్జీలు, ఆకాశాన్ని అంటుతున్నాయని ఈ పరిస్థితులలో పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అడ్డు అదుపు లేకుండా చమురు సంస్థలు గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని గ్యాస్ సబ్సిడీని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు తాళ్లపల్లి రహేలా, సౌందర్య, భవాని, సువర్ణ, ప్రమీల పద్మ విజయలక్ష్మి రజిత వాణి రేవతి, ధనలక్ష్మి లలిత, సునీత, రజిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.