Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని కల్లెడ గ్రామ పరిధిలో బుధ వారం రాత్రి సుమారు 08:30 గంటల ప్రాంతంలో పెట్రోకార్ కానిస్టేబుల్స్ నరేష్, రాకేష్ విదినిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తుండగా కల్లెడ వాగు ఒడ్డున ఒక బాలుడు ఏడుస్తూ నీటిలోకి వెళ్తుండడాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్ర మత్తమై అతన్ని నీటిలో నుండి బయటకు తీసుకొచ్చారు. బాలుడు ఆత్మహత్య యత్నానికి కార ణాలు రాబట్టేందుకు కానిస్టేబుల్స్ ప్రయత్నం చేసి విషయం తెలుసుకున్నారు. తన పేరు మద్ది బోయిన శ్యామ్ కల్లెడ అని చెప్పినట్లు తెలిపారు. ఇంట్లో తన తల్లిదండ్రులు మందలించడంతో జీవితంపై విరక్తి చెంది నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకు న్నానని చెప్పగా వెంటనే అతన్ని కానిస్టేబుల్స్ కౌన్సి లింగ్ చేసి అతని కుటుంబ సభ్యులను అప్పగించారు. మానవత్వం చాటి ఆదుకున్న సదరు కానిస్టేబుల్స్‌ను ఎస్సై డి.దేవేందర్ అభినందించారు.