Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో బాగంగా ఖిలా వరంగల్ కు విచ్చేసిన కాకతీయుల వారసుడు, బస్తర్ మహరాజు కమల్ చంద్ర భంజ్ దేవ్‌కి ఖిలావరంగల్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేం దర్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలి కారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాక తీయల కళావైభవానికి నెలవు వరంగల్ ప్రాంత మన్నారు. వారి అద్బుతమైన కళాసంపద ఇక్కడ కం డ్ల ముందే ఉందన్నారు. తెలంగాణా ఏర్పాటు తర్వాత వరంగల్ చరిత్ర, కాకతీయుల కళావైభవాన్ని గుర్తు చేస్తూ ప్రతీ ఏటా ఘనంగా కాకతీయ ఉత్సవాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లు నిర్వహిస్తున్నా రన్నారు. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపు తున్నారన్నారు. కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ రావటం సంతో షంగా ఉందని,వారికి ఘనస్వాగతం పలి కాలని అద్బుతంగా ఏర్పాట్లు చేసామ న్నారు. కాకతీయుల చరిత్ర కలిగిన ఈ ఖిలా వరం గల్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కే.టీ.ఆర్ల సహకారంతో టూరిజం హబ్‌గా మార్చుతామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మీ, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ టీ.రమేష్ బాబు, టీఆర్ఎస్ నాయ కులు చింతాకుల సునీల్, తదితరులు పాల్గొన్నారు.