Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి
నవతెలంగాణ-ఖిలావరంగల్
ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనలతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కాలం వెళ్లదీస్తు న్నాయని డివైఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి విమర్శించారు. గురువారం ఆయన రంగసాయీ పేట ఏరియాలోని లక్ష్మీపురం ప్రాంతంలో పై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య( డివైఎఫ్ఐ) దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణా లర్పించిన ఆశయ స్ఫూర్తిని కొనసాగించేందుకు 1980లో పంజాబ్లో ఏర్పడిందని తెలిపారు. విద్య ఉపాధి లక్ష్యంగా డీ వై ఎఫ్ఐ పనిచేస్తుందన్నారు. దేశంలో నిరు ద్యోగం పెరిగిపోతుందన్నారు. జాతీయ నిరుద్యోగ రేటు పెరిగిపోతుందన్నారు. ఎన్నికలు వస్తే తప్ప నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మండి పడ్డారు. ప్రకటనలతోనే పాలకులు కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వాలు ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులుగా బాదావత్ మహేందర్, కార్యదర్శిగా జన్ను బిక్షప తిని, ఉపాధ్యక్షులుగా సుధాకర్, సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా నలిగంటి రజిని, ప్రగతిలను ఏ నుకున్నట్టు పేర్కొ న్నారు. సహాయ కార్యదర్శిగా అనూషను, రజియాలతో పాటుగా మరో 45 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.