Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి పానిణి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు విద్యా ర్థులు ప్రధానంగా ఆంగ్ల మాధ్యమం విద్యా బోధనపై దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి. పానిణి అన్నారు. గురువారం మండల కేంద్రం లోని విద్యా వనరుల కేంద్రం నుండి జిల్లాలోని వివిధ మండలాలకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం విద్యా బోధ నకు సంబంధించి ఉపాధ్యాయలందరికీ శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులను కూడా ఆంగ్ల మాధ్యమ విద్య బోధనలో తట్టుకు నేందుకు సన్నద్ధం చేసే విధంగా తర్ఫీదు ఇవ్వను న్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండలంలో ప్రతి పారశాలలో ప్రతి గ్రామంలో ఆంగ్ల మాధ్యమం విద్యా బో ధన కార్యక్రమాన్ని సఫలీ కృతం చేసేలా ప్రతి ఒక్క రూ సహకరించాలని ఆయన అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో లక్ష 85 వేల పాఠ్యపుస్తకాలు అవ సరం కాగా ప్రస్తుతం 65 వేల పాఠ్యపుస్తకాలు మాత్ర మే ఇప్పటివరకు దిగుమతి కావడం జరిగిందన్నారు. వీటిని ఏమాత్రం ఆలస్యం లేకుండా విద్యార్థులకు పంపిణీ చేసే విధంగా సరఫరా చేసి పంపిణీ చేయా లని చెప్పినట్లు తెలి పారు. మిగతా పాఠ్యపుస్తకాలు మరో రెండు రోజుల్లో అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్లు అన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ తో పాటు స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.