Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్గలయ్య గుట్టను సందర్శించిన కాకతీయ వారసుడు
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కాకతీయ వైభవ సప్తాహం నగరంలో గురు వారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ ముఖ్యఅతిదిగా హాజరుకాగా ఆయనకు హనుమకొండ హరిత హోటల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ వినయభాస్కర్ వివిధ కళారూపాల ద్వారా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోచమ్మ మైదాన్‌లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుండి వరంగల్ కోటకు చేరుకున్నారు. గుర్రాల బండి పై ఊరేగింపు తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. కాకతీయుల చరిత్రను తెలు సుకోవడంతో పాటు కళా సంపదను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అనం తరం వేయిస్తంభాల దేవాలయం, అగ్గ లయ్య గుట్ట దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా కాకతీయ హరిత హోటల్లో తెలంగాణ సంప్రదాయ కాటకా లతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొ న్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడుతూ కాకతీయుల వంశంలో పుట్టడం నా అదృష్టంగా, గర్వంగా ఉందన్నారు. వారి పూర్వీకుల కళా సంపద అద్వి తీయం, అపూర్వ మని అన్నారు. ఓరు గల్లు ప్రజలు కలకాలం సుఖ, సంతోషాలతో ఉం డాలని అన్నారు. కాక తీయుల గొప్పతనాన్ని గుర్తుంచుకొని వేడుకలు నిర్వహి స్తునందుకు, ఈ వేడుకల్లో తనను భాగస్వామిని చేసినందుకు రాష్ట్ర ప్రభు త్వానికి కతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మంత్రి శ్రీని వాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో కాకతీయ వైభవం వేడుకలను కాకతీయుల కళా వైభవం, ఆచార సంప్రదాయాలు ప్రతి బింబించే విధం గా నిర్వహిస్తున్నామన్నారు. వారం రోజులపాటు వేడుకలను నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ప్రజలు భాగస్వాములై వేడుకలను విజ య వంతం చేయాలని అన్నారు. కాకతీయ వైభవం సప్తాహం సందర్భంగా హన్మకొండ పట్టణమంతా పండుగ వాతా వరణం నెలకొంది హన్మకొండలోని అదాలత్ సెంటర్, అంబే ద్కర్ జంక్షన్, అశోక జంక్షన్, హనుమకొండ చౌరస్తా, వేయి స్తంభాల గుడి వద్ద ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వివిధ కళాబందాలచే ప్రత్యేక సంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధా రాణి, ఎంపి పసునూరి దయాకర్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , డైరక్టర్ ఆఫ్ కల్చర్ మామిడి హరి కష్ణ, రెం డూ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డా గోపి, సిపి తరుణ్ జోషీ, కమిషనర్ ప్రావీణ్య, పాల్గొన్నారు.