Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు
నవతెలంగాణ-వర్ధన్నపేట
పామ్ ఆయిల్ పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తుందని పామాయిల్ సాగుపై రైతులు దష్టి సారించి ఆర్థికంగా అభివద్ధి చెందాలని హార్టికల్చర్ జిల్లా అధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏడిఏ సురేష్ అధ్యక్షతన ఆయిల్ పామ్ పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ణి ఉషాదయాళ్ హాజరై పంటల సాగు, అధునాతన పద్ధ తులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామ్ ఆయిల్ సాగు ద్వారా తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థిక లబ్ధి పొందాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో ఎలాంటి రసా యన ఎరువులు పిచికారి చేయకుండా కేవలం కాంపోస్ట్ ఎరువులు, పెంట ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు మా త్రమే ఎరువులుగా వాడాలన్నారు. ప్రతి రైతు సాగు చేసే పంటపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు కోసం సంవత్సరానికి తొమ్మిది వేల ఎకరాలులో సాగు చేసేందుకు ప్రణాళిక రూపొం దించడం జరిగినదన్నారు. ఈ పంట వేసుకునే వారికి డ్రిప్ సబ్సిడీ , మొక్కలపై సబ్సిడీ 90 శాతం ఇవ్వడం ఇస్తున్నట్లు చెప్పారు. ఉషాదయాళ్ మాట్లాడుతూ జీలుగా వేయడం వల న ఉండే ఉపయోగాలను, అధిక సాంద్రత పత్తి విధా నంపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పిటిసి మార్గం బిక్షపతి , మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రాంనర్సయ్య, హార్టికల్చర్ ఆఫీసర్ ఐలయ్య, ఏఈవోలు కావ్య మౌనిక, ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ దేవరాజ్, రైతులు తదితరుల పాల్గొన్నారు.