Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
మండల పరిధిలోని కీర్య తండ గ్రామాన్ని ప్రత్యేక అధికారిని సీఎస్ శాంతికుమారి, సీసీఎఫ్ ఎస్సై ఆశ, డీఎఫ్వో అర్పణ శ్యాల్ సందర్శించారు. సందర్శనలో భాగంగా హరితహారంలో నాటిన, ఫారె స్ట్ విభాగంలోని మొక్కలను పరిశీలించారు. ఫారెస్ట్ ఆధీనంలోని ఉన్న భూమిని, మొక్కలు నాటేందుకు అనువుగా ఉన్న ఫారెస్ట్ భూమిని పరిశీలించి గుర్తిం చారు. అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బృహత్పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు, తదనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని నర్సరీలో పెంచే మొక్కలను పరిశీలించి మొక్కలు ఇంకా పొడవుగా ఉండే విధంగా చూసు కోవాలని సూచించారు. గ్రామంలో ఫారెస్ట్ ఆధీనం లో ఉన్న భూమిలో నాటిన మొక్కలకు సంరక్షణ కల్పించాలని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీరు అందించాలని అన్నారు. మొక్కల చుట్టుపక్కల మొలిచే పిచ్చి మొక్కలను వెరసి హరి తహారం మొక్కలకు పూర్తి రక్షణ కల్పిం చాలని తెలి పారు. అనంతరం ఎంపీడీఓ సుమన వాణి, కీర్యా తండా సర్పంచ్ హట్యా నాయక్, గ్రామ కార్య దర్శు లతో కలసి గ్రామ ప్రజలకు నర్సరీలో పెంచిన మొక్క లను పంచారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రమేష్ ఎంపీడీఓ సుమన వాణి, ఉపసర్పంచ్,గ్రామ కార్యదర్శి హుస్సేన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.