Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
గృహ అవసర వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ రూ.50 పెంచి సామాన్యులపై మరోసారి కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారం మోపిందని, వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు టి ఉప్పలయ్య డిమాండ్ చేశారు. గురువారం హన్మకొండ రామ్‌నగర్‌లోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాల యం నుంచి అంబేద్కర్ విగ్రహ సెంటర్ వరకు రాస్తా రోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం హనుమకొండ వెస్ట్ మండల కార్య దర్శి వీరన్న అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప్పలయ్య పాల్గొని మాట్లాడారు. 24నెలల్లో గ్యాస్ ధరలు రూ.418.50పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోం దన్నారు. ఇది బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ఒకపక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన, పిల్లల ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, బీజేపీ ప్రభుత్వ హయాంలో దారుణంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమ ర్శించారు. కార్పొరేట్ కంపెనీల మోజులో పడి బీజేపీ ప్రభుత్వం గతంలో గ్యాస్ పై ఇచ్చిన సబ్సిడీ ని పూర్తిగా ఎత్తివేసిందన్నారు. రెండేండ్ల కిందట ఉన్న స్థాయికి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీపీఐ (ఎం)తోపాటు ఇతర ప్రజా సంఘాలు, పార్టీలను కలుపు కొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు ధరావత్ బాలు నాయక్, వల్లెపు రాజు, కుక్క ముడి రవీందర్, రమా, కవిత, రమ్య సౌందర్య, లక్ష్మి స్వప్న ఉమా, జగన్ రాజేష్, రాంబాబు వెంకన్న వెంకటేష్ తిరుపతి, అలీషా హసీనా పాల్గొన్నారు.