Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
ఈ నెల 9న కాకతీయ వైభవ సప్తాహం ఒక రోజు కార్యక్రమం స్థానిక నందన గార్డెన్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె శశాంక తెలిపారు. బుధవారం రాత్రి కలక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ ఎం డేవిడ్తో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను సంబంధిత అధికారు లతో సమీక్షించారు. కాకతీయుల వైభవాన్ని అందరికీ తెలిసేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అధికారలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా పశు సంవర్ధక శాఖా అధికారి డాక్టర్ టి సుధాకర్, ఉద్యానవనశాఖ అధికారి సూర్యనారాయణ, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ కవిత, ఎంపీడీఓ, తహసీల్ధార్ నాగ భవాని, తదితరులు పాల్గొన్నారు
పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
నెల్లికుదురు : 'మన ఊరు మన బడి' ద్వారా పాఠశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక తెలిపారు. గురువారం నెల్లికుదురు మండల కేంద్రంలో పర్యటించి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేస్తున్న, చేయవలసిన పనులను పరిశీలిం చారు. అనంతరం నైనాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల, బాలికలకు విడిగా టారులెట్ నిర్మాణం చేయాలని, కాంపౌండ్, సంప్ ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటిని వారం రోజుల పాటు 132 మందికి సరిపడా వస్తున్నాయా లేదా పరిశీలించి మిషన్ భగీరథ ఇంట్రా వారికి తెలుపాలన్నారు. సంప్ వరకు మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పాఠశాలలో చేస్తున్న విద్యుత్ పనులను పరిశీలించారు. కిచెన్ షెడ్ కు అవసరం మేరకు మరమ్మతు చేయాలన్నారు. అనంతరం పాఠశాలకు కొత్తగా ఎంత మంది పాఠశాలలో విద్యార్థులు చేరారని, ప్రైవేట్ విద్యా సంస్థల నుండి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారని హెచ్ఎం ఇంద్రసేనారెడ్డి ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ఉన్న హెచ్ఎంకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించారు. పాఠశాల కూలిపోయిన చోట ప్రహరీ నిర్మించాలని సర్పంచ్ యాదగిరి రెడ్డిని ఆదేశించారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాఠశాల రోడ్డు పనులు చేయాలని అన్నారు. ఈ ఏడు 10జీపీఏ విద్యార్థులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి 30 ఫ్యాన్లు ఇస్తానని హామీ ఇచ్చాఉరు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. సర్పంచ్ యాదగిరి రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి ఎండీ అబ్దుల్ హై, తహసీల్ధార్ యోగేశ్వర్రావు, ఎంపీడీఓ శేషాద్రి, ఆర్అండ్బీ ఈఈ తానేశ్వర్, ఆర్డీవో రమేష్, డీహెచ్ఎస్ఓ సూర్యనారాయణ, ఎంఈఓ గుగులోతు రాము, ఆయా పాఠశాల ప్రధానో పాధ్యాయుడు లింగారెడ్డి, సుమలత, ఇంద్రసేనారెడ్డి, నైనాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.