Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయాలి
- జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-ఐనవోలు
జూలై 24 నుండి26 తేదీలలో హనుమకొండలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బహి రంగ సభ నిర్వహిస్తున్నారని, పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలియోట్ బ్యూరో బీవి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవు తున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. గురువారం వెంకటాపురంలో మండల కమిటీ సభ్యులు సర్పంచ్ బండి పర్వతాలు అధ్య క్షతన ఏర్పాటు చేసిన ఐనవోలు మండల కమిటీ సమా వేశంలో చక్రపాణి పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలొకొచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంకు బొగ్గు రక్షణ రంగం తదితర వాటిని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ జాతి సంపాదన లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోడీ మోసం చేశారని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో మోడీ కులమతం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడు తున్నారని అన్నారు. పార్టీ మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే అప్పులు తీరతాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలకు ఏడేండ్లుగా నిరాశే ఎదురవుతోందని అన్నారు. వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం అయినా కేవలం సుమారు 250 మందికి దళిత బంధు కింద ఎంపిక చేశారన్నారు. ఇందులో వారి కార్యకర్తలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మండలంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు వర్తింపజేయాలని, మండలాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దళితులందరినీ సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బండి పర్వతాలు, గుండెకారి మహేందర్, కే నారాయణ రెడ్డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.