Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శంకర్‌నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మండలంలోని వావిలాల గ్రామ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు మీద కాల్వపై నీరు ప్రవహించడంతో ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరదల ప్రాంతానికి ప్రజలు వెళ్లకూడదని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు గానీ తనకు గానీ తెలియజేస్తే వారిని ఆదుకుంటామని అన్నారు. సర్పంచ్ బొల్లెపల్లి శ్రీనివాస్ , ఎంపీటీసీ అమని మంగ్య నాయక్ , రాజ్య తండా సర్పంచ్ రాధిక రమేష్, గ్రామ అధ్యక్షులు నలమస సోమయ్య , యూత్ మండల ప్రధాన కార్యదర్శి సిరికొండ మదుకర్ రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ప్రమాద స్థలాల వద్దకు వెళ్లొద్దు : తాసిల్ధార్
భారీ వర్షాల వల్ల ప్రమాద స్థలాల వద్దకు ప్రజలు వెళ్లకూడదని తహసిల్దార్ యోగేశ్వరరావు, ఎస్సై పత్తిపాక జితేందర్, ఎంపీడీవో శేషాద్రి సూచించారు. మండలం లోని ఆలేరు, వావిలాల, నెల్లికుదురు, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాలను ఆదివారం వారు సందర్శించి మాట్లాడారు. కాజ్‌వేలు, చెరువులు వద్దకు ప్రజల వెళ్లకూడదని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. శిధిలా వ్యవస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని తెలిపారు విద్యుత్ స్తంభాల వద్ద జె వైర్ ఉన్న చోట వర్షాలు పడుతుంటే వాటిని ముట్టుకోవద్దని అన్నారు. ఎంపీఓ పార్థసారథి, సర్పంచులు చింతకుంట్ల యాకన్న బొల్లెపల్లి శ్రీనివాస్ యాదగిరి రెడ్డి, ఇరిగేషన్ ఏఈ కిషన్ నాయక్ మురళి, యాకన్న, ప్రశాంత్ పాల్గొన్నారు.