Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ మండల కార్యదర్శి రవీందర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు నిర్మించి వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని సిపిఐ వరంగల్ మండల కార్యదర్శి బుస్సా రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం 19వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ లోని లోతట్టు ప్రాంతాలను సిపిఐ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీరు సరైన డ్రైనేజీ లేనందువల్ల వర్షపు నీరు గాంధీనగర్ వాసుల ఇళ్లలోకి చేరి పేదల ఇళ్లలోని వస్తువులన్నీ తడుస్తున్నాయన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత ప్రతిపాదికన పనులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గుండె బద్రి, గాంధీనగర్ శాఖ కార్య దర్శి శనిగరపు దేవరాజు, మంగ చంటి, చింత ప్రభాకర్, ఈశ్వర్, శారద, తదితరులు పాల్గొన్నారు.