Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు అందుబాట్లో ఉంటూ సహాయక చర్యలకు సిద్ధపడాలి
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురువనున్నందున నియోజ వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. క్యాం ప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడించారు. నైరుతి రుతుపవనాల ప్రభా వంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురువనుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఈ మేరకు నియోజ కవర్గంలో ఇప్పటికే వాగులు, చెరువులు నిండు కుంటు న్నాయని మరో రెండ్రోజులో పొంగి పొర్లను న్నాయని తెలిపారు. లోతట్టులో నివసిస్తున్న ప్రాంతాల ప్రజలు పరిస్థితి తీవ్రను గమనించి అప్రమత్తంగా ఉండా లన్నారు. ఇప్పటికే శిథివాలవస్థలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యమ్నాం చూసుకోవాలన్నారు. చెరువులు, కాల్వ లు వరద తీవ్రతకు దెబ్బతిన కండా ముందస్తూ జాగ్రత్తలు చేపట్టడానికి నీటిపారుదల, రెవిన్యూ శాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ వై ర్లు తెలిన, స్థంబాలు నేలవాలిన వెంటనే ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరప ˜రాలో అంత రాయం లేకుండా చూడాలన్నారు. రెవిన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖ, విద్యుత్, పంచాయతీరాజ్, వైధాది కారులు అందుబాట్లో ఉండాలని ఎవరు సెలవులపై వెళ్ల వొద్దన్నారు. పరిస్థితి తీవ్రతరణను ఎప్పటికప్పుడు అధి కారులు ప్రభుత్వానికి తగిన సమాచారం అందజేసి తగు సహాయక చర్యలు చేపట్టడానికి సంసిద్దులు కావాలన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో అధికారుతో కలిసి ఈ సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధులు భారిన పడే అవకాశం ఉన్నందున ఆసుపత్రులలో తగిన మందులు అందబాట్లో ఉంచుతూ వైద్య సేవలు అందించాలన్నారు. భారీ వర్షాల వల్ల ముప్పు ఉన్నందున అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి బయటకు రావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
మట్టెవాడ : నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో మట్టెవాడ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సీహెచ్ రమేష్ ప్రజలకు సూచించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షం గాలులకు పోచమ్మమైదాన్ రహదారిపై చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోగా వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం అందుకున్న సిఐ తన సిబ్బందితో కలిసి చెట్టును రోడ్డుపై నుండి పక్కకు తొలగించారు. ఆయన చూపిన చొరవను వాహనదారులు ప్రశంసించారు. అనంతరం స్టేషన్ పరిధిలోని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షాల కారణంగా వరద నీళ్లు ఇండ్లల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ముంపు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. విస్తా రంగా కురుస్తున్న వర్షాలతో నివాస గహాలు కూలిపోయే ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. అత్యవసర సేవల కొరకు డయల్ 100 లేదా 9491089129, 9440700508 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
గోవిందరావుపేట : వర్షం ప్రభావం తగ్గినందున వరదలు పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం వరదల ప్రాంతంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన సందర్శించారు. దెయ్యాలవాగు గుండ్ల వాగు పరివాహక ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కాలనీలో ఇండ్లలోకి నీరు చేరిన గహాలను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రైతులు వ్యవసాయ కూలీలు గృహాలకి పరిమితం కావాలని సూచించారు. వరద ప్రమా దం పెరిగితే పునరావస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వరదలను నిరంతరం పరీక్షించాలని అకస్మాత్తుగా వస్తే నష్టం సంభవిస్తుంది అన్నారు. ఇలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని వరదల నియం త్రణలో నివారణలో ప్రజలు ప్రజాప్రతినిధులు భాగస్వా ములు కావాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసి ల్దార్ మమత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్. రాజేందర్. వీఆర్వోలు వీఆర్ఏలు పాల్గొన్నారు.
వర్ధన్నపేట : మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై రామరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ముఖ్యంగా కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను ముట్టు కోకుండా చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. చుట్టూ కంచె లేని బావుల దగ్గర జాగ్రతగా ఉండా లన్నారు. ప్రజలంతా పోలీసులతో సహకరిస్తూ ఎలాంటి విపత్కర పరిస్థితులున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
రాయపర్తి : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై బండారి రాజు అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రజలు విద్యుత్ స్తంభాల వద్దకు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్లి పట్టు కోవద్దు అని సూచించారు. సమావేశంలో హెడ్ కాని స్టేబుల్స్ ఎల్లయ్య, రవీందర్, నర్సింగరావు, హైమాద్, కాని స్టేబుళ్లు చిదురాల రమేష్, సంపత్, రాజు, పాల్గొన్నారు.
ఖానాపురం : మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామాలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఎం పీడీవో సుమనవాణి అన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసు కోవాలని సూచించారు. ఎక్కడైనా ఇల్లు కూలి పోయి నా, రోడ్లు వంతెనలు కొట్టుకుపోయినా, సమా చారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని కోరారు.
పర్వతగిరి : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ తెలిపారు. వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తున్నపుడు వాహనాలతో దాటడానికి సా హసం చేయవద్దన్నారు. అత్యవసర సమయంలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
గోవిందరావుపేట : అల్పపీడనం తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మండల వ్యాప్తంగా ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తహసీల్దార్ అల్లం రాజ్‌కుమార్ అన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున విద్యా ర్థులు కూడా బయటకు రావద్దని సూచించారు. వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరిస్తున్నట్లు తెలిపారు.