Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
గిరిజన తండాలు,గ్రామాల్లో అంతర్గత రోడ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వర్షా కాలంలో గిరిజనులు నడవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు భూక్య హరినాయక్ అన్నారు. మండలం లోని చిన్నబంజరతండ గ్రామంలో ఆదివారం గిరిజనులు బురదమయమైన రోడ్డుపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల పోరాట ఫలితంగా తండాలు జీపీలుగా మారాయని, కానీ అభివృద్ధికి నోచుకోవట్లేదని వాపోయారు. తండాల్లో అంతర్గత రోడ్లకు నిధులు మంజూరు చేయకపోవడం దారుణం అన్నారు. ఇటీవల ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరి ప్రియ పల్లె నిద్ర పాదయాత్ర సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని హామీనిచ్చి నిధులు కేటా యించక పోవడం శోచనీయమన్నారు. తక్షణమే ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధుల మంజూరు కు కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చమ్మ, సునీతా, జ్యోతి, శ్రీధర్, మోతీలాల్, సీఐటీయూ మండల నాయకులు ఎం గిరిప్రసాద్, గిరిజన మహిళలు పాల్గొన్నారు.