Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన రాకపోకలు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-కొత్తగూడ
వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మండలంలోని గుంజేడు వాగు, బుర్కపెల్లి వాగు, వేలుబెల్లి వాగు, మొండ్రాయి గూడం వాగు, ముస్మి వాగు, గాదె వాగు, కత్తెర్ల వాగు లు ఉద్ధతంగా ప్రవహిస్తూ పొలాల్లోకి వరద చేరడంతో కొత్తగూడ ఏజెన్సీ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అడుగు తీసి అడుగు వేయలంటేనే ఏజెన్సీ ప్రజలు జంకుతున్నారు. పంచాయతీ, రెవెన్యూ, పోలిస్ అధికారులు వాగుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకు న్నారు. వాగు వద్ద గ్రామపంచాయతీల ట్రాక్టర్లు సైతం అడ్డు పెట్టి ప్రజలు ఎవరు వాగులు దాట కుండా సర్పంచులు, ఉప సర్పంచులు గస్తీ కాస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.తాసిల్ధార్ చందా నరేష్, ఎంపీడీఓ భారతి, ఎస్సై నగేష్, ఎంపీఓ సత్యనారాయణతోపాటు సర్పంచ్లు వాగుల వద్ద వాహనదారులకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. వాగులు దాటేందుకు సాహసం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.