Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీమాబాద్
బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆదివారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ముస్లిం సోదరులతో ఖమ్మంరోడ్డులోని ఈద్గాను ఆనుకొని ఉన్న మసీదులో ఈద్గా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ జబ్బర్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ప్రజలు అన్ని మతాల పండుగలను కలిసిమెలిసి ఒకరికొకరు గౌరవించుకుంటూ సంతోషంగా జరుపుకుంటా రన్నారు. అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివద్ధి చెందాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో చాంద్ పాషా, మాషిక్ ఆలీ, నామిన్ రజాక్ ఆలీ, జానీ బారు, కొమ్మినేని, నజీర్ అహ్మద్, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ : హిందూ ముస్లింలు కలిసి మెలిసి పండగలు జరుపుకుంటూ మతసామరస్యానికి ప్రతీకగా తెలంగాణ ప్రజలు నిలుస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ అన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా ఆదివారం 27వ డివిజన్ యాకూబ్పుర మసీదులో ముస్లిం మత పెద్దలను కలిసి ప్రకాష్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండగ త్యాగాలకు స్నేహభావాలకు శాంతి సామరస్యానికి ప్రతీక అన్నారు. మనకు ఉన్న దానిలో కొంత ఇతరులకు సహాయం చేయడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షేక్ ఇస్మాయిల్, చాంద్ పాషా, సయ్యద్ పాషా, అజీమ్, ముజాహిద్, ముష్రఫ్ అలీ, ఫనా, మహమ్మద్, సోయల్ షరీఫ్, మౌజాన్, బిలాల్, అబ్బాస్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు
రాయపర్తి : హిందువులు సంవత్సరారంభంగా పరిగణించే తొలి ఏకాదశి పండుగ, ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినం ఆదివారం మండల ప్రజలు కులమతాలకతీతంగా అట్టహాసంగా జరుపు కున్నారు. కార్యక్రమంలో మసీద్ ఏ-నూర్ సదర్సిహెబ్ మహ్మద్ లాయఖ్లీ, మసీద్ - ఏ - ఆలంగీర్ సదర్సహెబ్ మహ్మద్ లాయఖ్లీ, ముస్లీం మత పెద్దలు మహ్మద్ బాష మియా, గుంషావళి, అక్బర్, రఫీ, హుస్సేన్, యాకూబ్‌పాష, సలీం, అస్గర్‌అలీ, యూసూఫ్, చాంద్‌పాష, జబ్బార్, షకీల్, మన్నన్, లతీఫ్, షరీఫ్, సత్తార్, నాసర్, అమప్పాష, రజా క్పాష, రహీమొద్దీన్, మైపాష, మన్సూర్, వసీం, యాసీన్, తదితరులు పాల్గొన్నారు .
గోవిందరావుపేట : పవిత్రమైన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముస్లిం సోదరులంతా ప్రార్ధన మందిరానికి చేరుకొని ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలాగే అలై బలై చెప్పుకొని పేదలకు సహాయం చేశారు. రాజకీయ నాయ కులు, పాఠశాల విద్యార్థులు పిల్లలు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గాలో మత గురువు ఖురాన్ చదివి వినిపించారు.
నర్సంపేట : బక్రీద్ పండుగ వేడుకలు ఆయ మస్జీద్‌లలో నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని పలు మస్జీద్‌లలో మత గురువులు పండుగ నేపధ్యాన్ని తెలి య జేస్తూ ఉద్భోధించారు.మజీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ నబీ ఆధ్వర్యంలో మత గురువు మౌలానా మహబూబ్ ముస్లీమ్‌లను ఉఉద్దేశించి ప్రసంగించారు. బక్రీద్ పండుగ కుల, మతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగ అన్నా రు. పేదలకు నిత్యం సహాయం చేస్తూ, వారి అభ్యున్నతికి పాటుపడడం ద్వారానే మోక్ష మార్గం సిద్ధిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అయూబ్ ఖాన్, ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్, అబ్దుల్ ఖాదర్, ఇంతి యా జ్, ఖాసీం ప్రధాన కార్యదర్శి హబీబ్, సంయుక్త కార్యదర్శి అజీజ్, మైనారిటీ అధ్యక్షులు షేక్ జావీద్, పాషా, నిజాం, సిరాజ్, అజ్మత్ పాషా, సలహాదారులు విజ్ డమ్హై స్కూల్ డైరెక్టర్ ఎస్డీ.జావేద్, రిటైర్డ్ టీచర్ ఖలీల్, హుస్సేన్, మసూద్ అలీ బేగ్, గౌరవాధ్యక్షులు ముర్షద్, మాజీ అధ్యక్షులు షరీఫ్, షేక్ జాఫర్, మజీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.