Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయ చర్య లు చేపట్టాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పట్టణంలోని గుండ్లకుంట కాలనీ, నిజాం చెరువు, స్నేహనగర్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించి పలు సూచనలిచ్చారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అత్యవస రమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని విజ్జప్తి చేశారు. జలాశయాలు చెరువులు, కట్టలు తెగకుండా రెవెన్యూ అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలను మహిళలను జలాశ యాల వద్దకు వెళ్ళనీయొద్దన్నారు. వంకలు, చెరువులను మత్తడిలను దాటడానికి ప్రజలు ప్రయత్నించొద్దని అన్నారు. చేపలు పట్టే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముంపు ప్రాంతాల్లో ఉండొద్దని, తక్షణం సురక్షితమైన ప్రజా స్థలాలకు వెళ్లాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, చిట్యాల జనార్థన్, కౌన్సిలర్లు బుజ్జి వెంకన్న, విజయమ్మ, అధికారులు పాల్గొన్నారు.
ప్రాణనష్టం జరగకుండా చూడాలి : కలెక్టర్
బయ్యారం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు తీవ్ర ఉద్రిక్తితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని, జిల్లాలో వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. ఆదివారం మండలంలోని నామాలపాడు సమీపంలో ఇల్లందు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తున్న జిన్నెల వాగు లోవెల్ బ్రిడ్జిని సందర్శించారు. నీరు ప్రవహిస్తున్నందున అటు వైపు వెళ్లే వాహన రాక పోకలను వరద ఉధతిని బట్టి నిలిపివేయాలని అన్నారు. మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలలో వాగులు, వివిధ గ్రామాల రాక పోకల పై ఆరా తీశారు. మోట్లతిమ్మాపురం గ్రామానికి సరిహద్దులో వట్టె వాగు ఉదతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్టు తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు ఐక్యంగా విధులు నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాలలో పంచాయితీ సెక్రటరీలు వరద తీవ్రత ప్రమాదాల పై ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండి సమస్యలు తెలుసుకొని సం బంధిత అధికారులకు తెలపాలని సూచించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద తంగా ప్రవహించే వాగుల వద్ద గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. మండలంలోని అలిగేరు బ్రిడ్జి వద్ద వరద ఉదతిని పరిశీ లించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీ సదయ్య, ఆర్డీఓ కొమురయ్య, ఎంపీడీఓ చలపతిరావు, సీఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి పాల్గొన్నారు.
వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్
గార్ల : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలలో వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక పాకాల చెక్ డ్యాం వరద ఉధతిని జిల్లా ఎస్పీ శరత చంద్ర పవర్, ఆర్డీవో కొమరయ్యతో కలిసి పరిశీలించారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నం దున ప్రజలు అత్యవసరం అయితేనే ఇండ్లలో నుండి బయటకు రావాలని సూచించారు. పాకాల చెక్ డ్యాం వరదల ముంపు పొంచి ఉన్న రాంపురం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరా వాస కేంద్రాల కు తరలించి తగిన వసతులు కల్పించాలని మండల అధికారులకు సూచించారు. చెరువు లు,కుంట లలో వరద నీటి పరిస్థితులను అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జీపీ ఆధ్వర్యంలో కరెంటు స్తంభాలు, తెగిన విద్యుత్ తీగలు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద నీటి ప్రవాహ ప్రాంతాలలోకి వెళ్లకుండా అవసరం అయితే మైకుల ద్వారా ప్రచారం చేయాలని అన్నారు. దెబ్బతిన్న రోడ్డు మార్గాలకు తెగిపోయిన విద్యుత్ తీగలకు తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. డీఎస్పీ సదయ్య, సిఐ బాలాజీ, ఎంపీపీ మూడ్ శివాజీ చౌహాన్, సర్పంచ్ అజ్మీర బన్సీలాల్, తహసీల్ధార్ రాము, ఎంపీడీఓ రవీందర్, డిప్యూటీ తహసీల్ధార్ వీరన్న, రెవెన్యూ సిబ్బంది అశోక్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్
జనగామ కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం జిల్లా అధికారులతో సమీక్షించి కలెక్టర్ మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా శిధిలమైన భవనాలలో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలను కోరారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలకు విద్యుత్తు లైన్లకు వైర్ లకు దూరంగా ఉండాలని సూచించారు. డీసీపీ సీతారాం, అటవీశాఖ అధికారి నాగభూషణం, అదనపు కలెక్టర్ భాస్కర రావు, ఆర్డీవో మధుమోహన్, విద్యుత్ అధికారి మల్లికార్జున్, ఆర్ఆర్బీ ఈఈ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి రద్దు
ప్రజల సమస్యల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ఈనెల 11న నిర్వహించే గ్రీవెన్సెల్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చేపల వేటకు వెళ్లొద్దు : తాసిల్ధార్
తొర్రూరు : భారీ వర్షాల కారణ:గా తొర్రూరు మండలంలో మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దని తాసిల్ధార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని పలు వీధుల్లో సందర్శించి ఆయన మాట్లాడారు. భారీ వర్షాలకు గోడలు కూలే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండాలని, విషపురుగులు తిరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలను బయటకు పంపరాదన్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈత కొట్టడానికి వెళ్ళరాదని హెచ్చరించారు. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో చెట్టు కింద ఉండరాదని,గర్భిణులు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసరమైతే పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మునిసిపల్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించాలని, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఆరు బస్సులు రద్దు : డిపో మేనేజర్ రమేష్
వర్షాల కారణంగా ప్రయాణికులు లేక తొర్రూరు బస్టాండ్ వెలవెలబోతోంది. ప్రయాణికులు రాక ఆరు బస్సులు రద్దు చేసినట్లు డిపో మేనేజర్ రమేష్ తెలిపారు. వరంగల్ రూట్ లో రెండు బస్సులు, సూర్యాపేట రోడ్డులో ఒకటి, నర్సంపేట రోడ్డులో ఒకటి, మహబూబాబాద్ రూట్ లో ఒకటి, కొడకండ్ల రోడ్డలో ఒక బస్సును రద్దు చేసినట్లు తెలిపారు. మిగతా రోడ్లలో యధావిధిగా బస్సులు నడుస్తున్నాయని, వర్షాల వలన ఎక్కడ అవాంతరాలు జరగలేదని తెలిపారు.
నిరాశ్రయులకు ఆశ్రయం : మున్సిపల్ కమిషనర్
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నిరాశయులై ఉన్నవారికి స్థానిక ఎస్టీ హాస్టల్లో ఆశ్రయం ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు ఆదివారం తెలిపారు. మున్సిపల్ పరిధిలో కూలిపోయే దశలో ఇండ్లు ఉన్నవారు, ప్రజలు, వ్యవసాయ రైతులు, కూలీలు, కార్మికులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అవసరార్థులు, నిరాశ్రయులు ఎస్టీ హాస్టల్ వసతిని విని యోగించుకోవాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.
వరద ఉధృతితో రాకపోకలకు ఆటంకం
బయ్యారం : వర్షాల వల్ల మండల పరిధిలోని మోట్ల తిమ్మాపురం వెళ్లే దారిలో ఉన్న వట్టివాగు పొంగి ప్రవహి స్తుంన్నందున, సుద్దరేపు నుంచి కంబాలపల్లి వెళ్లే దారిలో ఉన్న పంది పంపుల వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. నామాలపాడు సమీపంలోని మహబూబాబాద్-భద్రాచలం జాతీయ రహదారిపై జిన్నెలవాగు నీటి ఉధృతి కారణంగా ప్రయాణికులకు ఆటంకం ఏర్పడింది.
ఉప్పొంగుతున్న వాగులు వంకలు
మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ఏజెన్సీ గ్రామాల్లో నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మండలంలోని పెద్ద చెరువు ఉద్రిక్తంగా 3 అడుగుల ఎత్తులో మత్తడి పోస్తోంది. మండలంలోని పాకాల యేరు, అలిగేరు ఉధతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెద్దవంగర: మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రం నుండి వడ్డెకొత్తపల్లికి వెళ్లే రహదారిపై భారీ వక్షం నేలకొరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు అక్కడికి చేరుకొని, రోడ్డుపై నుంచి వక్షాన్ని తొలగించారు. రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న పత్తి పంట నీట మునగడంతో దిగాలు చెందుతున్నారు.
భీమునిపాదం జలపాతంను ఎస్ఐ సందర్శన
గూడూరు : కొన్ని రోజులగా కురుస్తున్న వర్షంతో భీముని జలపాతం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం గూడూరు ఎస్ఐ బి సతీష్‌గౌడ్ భీముని పాదం జలపాతాన్ని సందర్శించి పర్యటకులకు పలు సూచనలిచ్చారు. వర్షాల ప్రభావంతో జలపాతం ప్రభావం ఉన్నందున లోనికి ఎవరు దిగకూడదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. నిత్యం పోలిస్, అటవీ శాఖ ఆధ్వ ర్యంలో పెట్రోలింగ్ ఉంటుందని తెలిపారు. పర్యాటకులు మద్యం సేవించి పర్యటన కేంద్రాలకు రాకూడదని హెచ్చరిం చారు. జలపాతం వద్దకు వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. పోలిస్,అటవీశాఖ సూచనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భీముని పాదం వద్ద పోటెత్తిన పర్యాటకులు
నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని భీముని పాదం జలపాతం పరవాళ్ళు తొక్కుతోంది. ఆదివారం కావడంతో వర్షం సైతం లెక్కచేయ కుండా పర్యాటకులు భారీ సంఖ్యలో జలపాతం వద్దకు చేరు కొని ఆహ్లాదకర వాతావరణం తిలకిస్తున్నారు. పర్యటనకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అటవీశాఖ ఏర్పాట్లు చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారుల పర్యటన
మండలంలోని పాకాల వాగు వరద ఉద్రిక్తతను తాసిల్దార్ ఎం అశోక్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ముసలమ్మ బాడువ వద్ద వరద ఉద్రిక్తతను పరిశీలించి అక్కడ చాపలు పడుతున్న జాలర్లను అక్కడి నుండి బయటకి పంపించారు . అనంతరం సీతారాగారం, భూపతిపేటలో, గోవిందపురం అపరాజ్పల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టులను మట్టేవాడ ఊట్ల గ్రామాల్లో కలవట్లేదు తాసిల్దార్ అశోక్ కుమార్,ఎంపీడీవో విజయలక్ష్మి ,ఎంపీఓ ప్రసాదరావు పరిశీలించారు. భూపతి పేట సీతానగరం మధ్యలో ఉన్న కల్వర్టుపై వరద ఉధతి పెరగడంతో భారీ గేట్ ఏర్పాటు చేయాలని పోలిస్శాఖకు ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలుంటే రెవెన్యూ సిబ్బందికి తెలియచేయాలని ఆదేశించారు. మండలంలోని 123 చెరువులు, కుంటలు ఉండగా సుమారు సగానికి పైగా అలుగు పోసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు
బొమ్మకూరు రిజర్వాయర్‌ను తాసిల్ధార్ పరిశీలన
నర్మెట్ట : నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్‌ను స్థానిక సీఐ నాగబాబు, ఎస్ఐ, తాసిల్దార్ గంగాభవాని, జెడ్పీటీసీ శ్రీనివాస్‌నాయక్ ఆదివారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లును గుర్తించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించా లని వీఆర్ఏ, కారోబార్‌ను ఆదేశించారు. డ్యాంపై నీటి సామర్థ్యం పరిశీలించి లోతట్టుప్రాంతాలవారిని అప్రమత్తం చేస్తామన్నారు. వీఆర్ఏ మంజుల, కారోబార్ మంజ నాయక్ పాల్గొన్నారు.
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు
తొర్రూర్ రూరల్ :
స్థానిక పెద్ద చెరువు అలుగుపోస్తుండడంతో కంటయపాలెం నుండి గుర్తురు వెళ్లే దారి ప్రమాదకరంగా మారింది. దీంతో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వాగు దాటడానికి ప్రయత్నించవద్దని తాసిల్ధార్ విజ్ఞప్తి చేశారు. గుర్తూర్ వద్ద నర్సంపేటకు వెళ్లే రోడ్డుపై వట్టి వాగు ఉధతంగా ప్రవహిస్తున్నడంతో ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ఎవరు కూడా వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్, ఎస్బీఐ నరేష్, డిప్యూటీ సూపరింటెండెంట్ పంజాల వెంకన్న గౌడ్, సర్పంచ్ రవీంద్రచారి, ఎంపీటీసీ మెరుగు మాధవి రమేష్ పాల్గొన్నారు
పొంగిపొర్లుతున్న గుండ్ల మడుగువాగు
గూడూరు : మండలంలోని మట్టెవాడ గ్రామపంచాయతీ దొరవారి తిమ్మాపురం ఏజెన్సీ ఆదివాసి గ్రామం వెళ్లే మధ్య మా ర్గంలో ఉన్న గుండ్లమడుగు వాగు పొంగి పొర్లుతోంది దీంతో ఆదివాసి గిరిజనులు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షా కాలంలో ముందస్తుగా ఆదివాసి గిరిజనులు అంతా కావలసిన నిత్యవసర వస్తువులను సమకూర్చుకొని అక్కడే ఉంటారు. అయి తే సమస్యాత్మక ప్రాంతాల్లో దొరవారి తిమ్మాపురం ఏజెన్సీ గ్రా మంపై కలెక్టర్ శశాంగా ప్రత్యేక దష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. తాసిల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దొరవారి తిమ్మాపూర్ గిరిజనులకు తగు జాగ్రత్తలు వివరించారు.
బావి కూలి రోడ్డంతా ద్వంసం
స్టేషన్‌ఘన్‌పూర్ : మండలంలోని సముద్రాల గ్రామానికి వెళ్ళే దారి ఊరిసమీపంలోని మైసమ్మ బావి ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా కూలి రోడ్డంతా ధ్వంసమైంది. గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి ఆదివారం ఆర్డీఓ క్రిష్ణ వేణి, తహశీల్దార్ పూల్ సింగ్, ఎస్సై శ్రావణ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. బావి యజమానిని పిలిచి మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, సర్పంచ్ గుండె విమలా నర్సయ్య, ఎంపీటీసీ పడిశాల సుగుణ వెంకటేష్ పాల్గొన్నారు.