Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
హంటర్ రోడ్డు నుండి ఉర్సు, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట వైపు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ కింద నుండి వెళ్లే మినీ అండర్ రైల్వే బ్రిడ్జిని రైల్వే అధికారులు ఆదివారం మూసివేశారు. వర్షాలు విస్తతంగా కురుస్తున్న నేపథ్యంలో చిన్న రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో మూడు నాలుగు ఫీట్ల లోతులో వర్షపు నీరు రైల్వే బ్రిడ్జి కింద నిల్వ ఉంది. దీంతో అటువైపుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు నీటిలో పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని వరంగల్ రైల్వే అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో రైల్వే ఉన్నత అధికారులు రైల్వే ట్రాక్కింద నుడి వెళ్లే చిన్న బ్రిడ్జి వైపు వెళ్లే దారిని మూసి వేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వర్షాకాలం ముగిసే వరకు గేటును మూసివేసి ఉంచుతామని తరువాత అధికా రులు ఇచ్చే ఆదేశాల మేరకు తగు చర్యలు ఉంటాయని రైల్వే సిబ్బంది తెలిపారు. ప్రజలు వాహనదారులు గమనించి రైల్వే అధికారులకు సహకరించాలని కోరారు.