Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రత లేక పర్యాటకుల ఇబ్బందులు
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని నామాలపాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెద్ద చెరువు అలుగుల వద్ద భద్రత కరువవ్వడంతో గతంలో పలుమార్లు ప్రమాధాలు సంబవించి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. చెరువు అలుగు ప్రకృతి అందాలను తిలకించడానికి మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పర్యాటకులు తరలి వస్తుం టారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల ఆనం దానికి హద్దులు లేకుండా అలుగు జల పాతంలో జలకాలాడుతారు. అలుగుల వద్ద పోలీసులు, అధికారుల నిఘా లేకపోవడంతో పర్యాటకుల సందడి హద్దులు మీరుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే కొందరు యువకులు మద్యం తాగుతూ, చిందులు వేస్తున్నారు. దీంతో పర్యాటకులకు ఇబ్బందికరంగా ఉన్నదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగు వద్ద భద్రత ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపి స్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాదికారులు చర్యలు చేపట్టి చెరువు వద్ద పోలీసు నిఘా, భద్రత ఏర్పాటు చేసి అలుగుల వద్ద ప్రమాదాలను నివారించాలని పలువురు కోరుతున్నారు.
మౌలిక వసతుల జాడేది?
ఏండ్ల చరిత్ర కలిగిన బయ్యారం పెద్ద చెరువును చూసేందుకు, ప్రకతి అందాలను ఆస్వాదించేందుకు నిత్యం అక్కడకు పర్యా టకులు వస్తుంటారు. సందర్శకులకు మౌలిక వసతుల కల్పన, బోటింగ్ ప్రతిపాదనలు ఉన్నా... అవి కార్యరూపం దాల్చలేదు. అక్కడ కనీస వసతులు లేకపోవటం బాధాకరం. చెరువుకి వచ్చే మార్గం కూడా సరిగా లేదని సందర్శకులు చెబుతున్నారు. చెరువు వద్ద మౌలిక వసతులు కల్పించి.. ఆ ప్రాంతాన్ని మరింత అభివద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చెరువును కాపాడుకు నేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్థానికులు కోరుతున్నారు.